Eid al-Adha: పండుగ పూట దుబాయ్ రాజు ఉదారం.. 505 మంది ఖైదీల విడుదల

ABN , First Publish Date - 2022-07-07T13:42:40+05:30 IST

దుబాయి జైల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో 505 మందిని బక్రీద్‌ సందర్భంగా విడుదల చేయాలని దుబాయ్‌ రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రాషేద్‌ అల్‌ మఖ్తూం బుధవారం ఆదేశించారు.

Eid al-Adha: పండుగ పూట దుబాయ్ రాజు ఉదారం.. 505 మంది ఖైదీల విడుదల

దుబాయ్‌లో 505 మంది ఖైదీల విడుదల

బక్రీద్‌ సందర్భంగా దుబాయ్‌ రాజు ఉదారం

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దుబాయి జైల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో 505 మందిని బక్రీద్‌  సందర్భంగా విడుదల చేయాలని దుబాయ్‌ రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రాషేద్‌ అల్‌ మఖ్తూం బుధవారం ఆదేశించారు. జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల వివరాలను అధికారులు రాజుకు నివేదించగా.. విడుదల చేయాలని ఆదేశించారు. రాస్‌ అల్‌ ఖైమాలోనూ 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ అక్కడి రాజు శేఖ్‌ సౌద్‌ బిన్‌ సఘర్‌ అల్‌ ఖాస్మీ కూడా ఆదేశాలు జారీ చేశారు. పండుగ కంటే ముందు యూఏఈతో పాటు గల్ఫ్‌లోని పలు రాజ్యాధిపతులు ఖైదీలను విడుదల చేస్తారు. భారతీయ ఖైదీల విడుదల కోసం ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. 

Updated Date - 2022-07-07T13:42:40+05:30 IST