మహిళా సంఘటిత శక్తిగా స్వయం సహాయక సంఘాలు(shg)

ABN , First Publish Date - 2022-06-29T22:03:04+05:30 IST

తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలు(SHG) మహిళలను సంఘటిత శక్తిగా తయారు చేస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

మహిళా సంఘటిత శక్తిగా స్వయం సహాయక సంఘాలు(shg)

హైదరాబాద్: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలు(SHG) మహిళలను సంఘటిత శక్తిగా తయారు చేస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటిలోనూ విస్తరిస్తుందని ప్రభుత్వం తయారుచేసిన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది.అందులో భాగంగానే మహిళలను సంఘటిత శక్తిగా తయారుచేయడమే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని మహిళ లో దాగిఉన్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. 


మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమ శిక్షణ వైపు మళ్లించడం మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 4,36,512  మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో 46,66,523 మంది సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలు ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని నివేదిక తెలిపింది.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం గత ఎనిమిదేళ్ల లలో 76,321 స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని, గ్రామీణ ప్రాంతాలలో  ప్రస్తుతం 4,36,512  మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్య లను ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో 553 మండల సమాఖ్యాలు, 17,954 గ్రామ సమాఖ్య పనిచేస్తున్నాయి.


రాష్ట్రంలో సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల లోని స్వయం సహాయక సంఘాలకు గత 8 ఏండ్ల  కాలంలో తెలంగాణ రాష్ట్రంలో (2014-15 నుండి 2021-22 వరకు) 56,004  కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించబడిందని నివేదిక తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి గణనీయంగా పెరిగిందని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,96,447 స్వయం సహాయక సంఘాలకు 3739 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించగా, 2021-22 సంవత్సరం లో 2 లక్షల 56 వేల 779 మహిళా స్వయం సహాయక సంఘాలకు 12,200 కోట్ల 59 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిందని వెల్లడించింది.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా 3,70,825 మహిళా స్వయం సహాయక సంఘాలకు 15001  కోట్ల 15 లక్షల రూపాయల బ్యాంకు లింకిజీ కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించబడగా, జూన్,29 వ తేదీ వరకు 31,303 మహిళా స్వయం సహాయక సంఘాలకు  1600 కోట్ల 41 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిందని, మిగతా లక్ష్యాన్ని 2023 మార్చి నెలాఖరులోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు నివేదికలో వెల్లడించారు. 



Updated Date - 2022-06-29T22:03:04+05:30 IST