శిల్పాశెట్టి స్థానంలో మలైకా అరోరా

May 6 2021 @ 13:17PM

శిల్పాశెట్టి సూపర్ డాన్సర్ - 4కి జడ్జ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె స్థానంలో మలైకా అరోరా కనిపించబోతున్నారు. సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ షోలో ఇప్పటి నుంచి కొన్ని ఎపిసోడ్స్‌లో మలైకా అరోరా అలాగే టెరెన్స్ లూయిస్ జడ్జెస్‌గా వ్యవహరిస్తారు. సూపర్ డాన్సర్ - 4 ఒక ఎపిసోడ్ నుంచి శిల్పా శెట్టి - అనురాగ్ బసు ఇతర షెడ్యూల్స్ కారణంగా తప్పుకున్నారు. వీరి స్థానంలో ఫరా ఖాన్ - రెమో డిసౌజా వచ్చారు. కాగా గీతా కపూర్ - మలైకా అరోరాతో కలిసి అనురాగ్ బసు ఈ సీజన్‌లో సందడి చేయనున్నారు. ఇప్పటికే టెలికాస్ట్ అవుతున్న ప్రోమోలలో మలైకా అరోరా, టెర్రెన్స్, గీతా కపూర్, అనురాగ్ బసు.. పిల్లలతో కలిసి కనిపిస్తున్నారు. ఈ ప్రోమోస్ ప్రేక్షకుల్లో ఆసక్తికి రేకెత్తిస్తున్నాయి. శిల్పా శెట్టి ఎప్పుడు తిరిగి షోలో కనిపించబోతున్నారనే విషయంలో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.