భర్త కేసులో స్పందించిన శిల్పాశెట్టి!

Aug 2 2021 @ 14:59PM

నా బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి

అసత్య కథనాలు సృష్టించవద్దు!


బాలీవుడ్‌ పోర్నోగ్రఫీ కేసులో నిందితుడిగా అరెస్ట్‌ అయిన రాజ్‌కుంద్రా గురించి భార్య శిల్పాశెట్టి పెదవి విప్పారు.  పూర్తి విషయం తెలుసుకోకుండా సగం సమాచారంతో వివాదాలు సృష్టించవద్దని ఆమె కోరారు. భారత న్యాయవ్యవస్థపై తనకి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. సోమవారం ట్విట్టర్‌ వేదికగా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘‘ గత రెండు వారాలుగా ప్రతి విషయంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ విషయంలో ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపిస్తున్నారు.  సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై ఇప్పటివరకూ నేను ఎక్కడా మాట్లాడలేదు.  ఓ సెలబ్రిటీగా నేను ఎవరి మీద ఫిర్యాదు చేయను, ఎవరికి వివరించి చెప్పను. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉంది. ముంబై, భారత న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. ఓ తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందర్నీ కోరుతున్నా. దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి. నా పేరుతో కథనాలు అల్లకండి. పూర్తి సమాచారం లేకుండా కామెంట్లు చేయకండి’’ అని శిల్పాశెట్టి  పేర్కొన్నారు. 


Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.