మెరిసే చేప... భలే!

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

మెరిసే చేప... భలే!

మెరిసే చేప... భలే!

కావలసినవి

రెండు పేపర్‌ ప్లేట్లు 

స్కెచ్‌ పెన్నులు

నలుపు రంగు 

బ్రష్‌

జిగురు

కత్తెర

కలర్‌ పేపర్‌


తయారీ విధానం

పేపర్‌ ప్లేట్‌ల వెనక భాగంలో నలుపురంగు వేసి ఆరబెట్టాలి.

స్కెచ్‌ పెన్నుల సహాయంతో చేప పొలుసుల మాదిరి గీతలను పేపర్‌ప్లేట్‌ మీద గీయాలి. బొమ్మలో చూపించిన విధంగా రంగురంగుల్లో గీస్తే ఆకట్టుకునేలా ఉంటుంది.

చేప తోక, మొప్పలు, కళ్ల కోసం కలర్‌ పేపర్‌ను కట్‌ చేసుకోవాలి. తోక, మొప్పలపై స్కెచ్‌ పెన్నుతో గీతలు గీయాలి. 

తరువాత వాటిని పేపర్‌ ప్లేట్‌కు బొమ్మలో చూపిన విధంగా అతికించాలి. 

చేప నోరు తెరిచి ఉన్నట్టుగా కనిపించడం కోసం పేపర్‌ ప్లేట్‌ ముందు భాగంలో కొద్దిగా కట్‌ చేస్తే మెరుస్తున్న చేప బొమ్మ రెడీ.

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST