షిర్డీకి ప్రత్యేక పర్యాటక విమానం

ABN , First Publish Date - 2022-01-06T17:05:18+05:30 IST

షిర్డీ, జమ్ము-కశ్మీర్‌కు ఐఆర్‌ సీటీసీ ప్రత్యేక పర్యాటక విమానం ఏర్పాటు చేసింది. చెన్నై నుంచి ఈ నెల 16న బయల్దేరే ఈ విమానంలో వెళ్లి షిర్డీ, త్రయంబకేశ్వర్‌ వంటి ఆలయాలు సందర్శించవచ్చు. మూడు రోజుల

షిర్డీకి ప్రత్యేక పర్యాటక విమానం

ఐసిఎఫ్‌(చెన్నై): షిర్డీ, జమ్ము-కశ్మీర్‌కు ఐఆర్‌ సీటీసీ ప్రత్యేక పర్యాటక విమానం ఏర్పాటు చేసింది. చెన్నై నుంచి ఈ నెల 16న బయల్దేరే ఈ విమానంలో వెళ్లి షిర్డీ, త్రయంబకేశ్వర్‌ వంటి ఆలయాలు సందర్శించవచ్చు. మూడు రోజుల పర్యటనకు ఒకరికి రూ.14,500 ఛార్జీగా నిర్ణయించారు. చెన్నై నుంచి ఫిబ్రవరి 26వ తేది పర్యాటక విమానంలో వెళ్లి జమ్ము- కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం సహా, పంజాబ్‌ లోని అమృత్‌సర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల సంర్శించవచ్చు. ఏడు రోజుల పర్యటనకు ఒకరికి రూ.31,500 ఛార్జీ నిర్ణయించారు. ఇతర వివరాలకు 9443140682 అనే నెంబరులో సంప్రదించవచ్చని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకనటలో తెలిపింది.


Updated Date - 2022-01-06T17:05:18+05:30 IST