నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి Shiv Sena పిలుపు

ABN , First Publish Date - 2022-06-25T01:53:05+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత వేడెక్కింది. శివసేన నేషనల్ ఎగ్జిక్యూటివ్..

నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి Shiv Sena పిలుపు

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత వేడెక్కింది. శివసేన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబై సేన భవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పటేల్, డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు శుక్రవారం సాయంత్రం ఉద్ధవ్ థాకరేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం నేపథ్యంలో శివసేన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం పిలుపునిచ్చారు. శివసేన అగ్రనేతలంతా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.


హైఅల్టర్..

మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై సహా అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. శివసైనికులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఆదేశాలిచ్చింది.

Updated Date - 2022-06-25T01:53:05+05:30 IST