MAA Election: హేమ నన్ను కొరికారు.. ఆమె మూడ్ నేను గమనించలేదు: శివబాలాజీ

ABN , First Publish Date - 2021-10-10T17:17:29+05:30 IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు గొడవకు దిగారు.

MAA Election: హేమ నన్ను కొరికారు.. ఆమె మూడ్ నేను గమనించలేదు: శివబాలాజీ

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. గుర్తు తెలియని వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి వచ్చి ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు సంబంధించిన కరపత్రాలను పంచుతుంటే మంచు విష్ణు ప్యానల్ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శివబాలాజీ చేయిని సీనియర్ నటి హేమ కొరకడం కలకలం రేపింది. ఈ విషయంపై ఏబీఎన్‌తో శివబాలాజీ మాట్లాడుతూ..‘‘నేను బారికేడ్స్ పట్టుకుని ఉంటే వెనుక హేమగారు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి వాళ్ల మనిషి కాబట్టి నేను చేయి ఎత్తకూడదని కోపంలో కొరికారు. ఆమె ఏ మూడ్‌లో కొరికారన్నది నేను సరిగ్గా గమనించలేదు. నా ఎడమచేతికి పంటిగాట్లు పడ్డాయి.’’ అని చెప్పారు. ఈ ఘటనపై హేమ స్పందిస్తూ.. శివబాలాజీ చేతులు వేయడం వల్లే తాను కొరికానని చెప్పారు.

Updated Date - 2021-10-10T17:17:29+05:30 IST