కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్

Published: Sun, 16 Jan 2022 10:05:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్

కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ‘డాక్టర్’ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న శివ కార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. తెలుగులో కూడా స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రంలో నటించబోతున్నాడు. రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International