నేను కూడా సీఎం రేసులో ఉన్నా...

ABN , First Publish Date - 2021-12-12T18:45:17+05:30 IST

ఏడాదిన్నర తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కుర్చీకోసం పోట్లాట సాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు సీఎం హోదా కోసం ఎప్పటికప్పుడు పావులు

నేను కూడా సీఎం రేసులో ఉన్నా...

                       - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్యామనూరు 


బెంగళూరు: ఏడాదిన్నర తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కుర్చీకోసం పోట్లాట సాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు సీఎం హోదా కోసం ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారు. తాజాగా కేపీసీసీ కోశాధికారి, సీనియర్‌ నేత దావణగెరెలో ప్రముఖ పారిశ్రామిక, విద్యాసంస్థల అధినేతగా పేరొందిన శ్యామనూరు శివ శంకరప్ప కొత్తబాంబు పేల్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేనుసైతం సీఎం రేసులో ఉన్నానన్నారు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక నిర్ణయించుకోవాలిగానీ ఏడాదిన్నర ముందే ఇలాంటి పరిస్థితి సరికాదన్నారు. నాకు సీఎం హోదా కావాలని అయితే అధిష్ఠానం నిర్ణయం కీలకం కానుందన్నారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లే కాకుండా సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, పరమేశ్వర్‌లు సైతం సీఎం హోదా కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-12-12T18:45:17+05:30 IST