Shivalingam: మట్టిలో కూరుకుపోయిన శివలింగం

ABN , First Publish Date - 2022-09-15T13:33:06+05:30 IST

శివగంగ జిల్లా ఇళయాంగుడి సమీపంలోని నానామడైలో మట్టిలో కూరుకుపోయిన శివలింగం(Shivalingam) పురావస్తు పరిశోధనల్లో బయల్పడింది.

Shivalingam: మట్టిలో కూరుకుపోయిన శివలింగం

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 14: శివగంగ జిల్లా ఇళయాంగుడి సమీపంలోని నానామడైలో మట్టిలో కూరుకుపోయిన శివలింగం(Shivalingam) పురావస్తు పరిశోధనల్లో బయల్పడింది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం పురాతన విశేషాల గురించి పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్‌ మీడియాకు వివరించారు. రావణాసురుడి చెర నుంచి సీతమ్మను విడిపించేందుకు హనుమంతుడి సైన్యంతో శ్రీరాముడు శ్రీలంకకు బయల్దేరి దారిలో చాలా చోట్ల తమకు విజయం చేకూరాలని శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు చరిత్ర ఆధారాలున్నట్లు తెలిపారు. శ్రీరాముడు శివగంగ జిల్లా ఇళయాంగుడి సమీపంలోని నానామడై ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో ప్రతిష్ఠించిన శివలింగం మట్టిలో పూడుకుపోయి తాజాగా జరిపిన తవ్వకాల్లో బయల్పడిందని, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి(Sri Ramachandra Murthy) పూజించిన శివలింగంగా స్థానికులు భావించి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని, ఇక్కడ శివాలయం నిర్మించి నిత్యపూజలకు వసతులు కల్పించాలని నానామడై గ్రామస్తులు హిందూ దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు.

Updated Date - 2022-09-15T13:33:06+05:30 IST