శివలింగంపై సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2022-04-07T15:50:00+05:30 IST

స్థానిక కాట్పాడి సమీపం విన్నంపల్లిలో వెయ్యేళ్ల పురాతన అగస్త్యేశ్వరాలయం ఉంది. ఆలయ గర్భగుడిలోని శివలింగంపై ఏడాదికి ఒకరోజు సూర్యకిరణాలు ప్రసరిస్తుంటాయి. ఆ ప్రకారం

శివలింగంపై సూర్యకిరణాలు

                                        - పరవశించిన భక్తులు


వేలూరు(చెన్నై): స్థానిక కాట్పాడి సమీపం విన్నంపల్లిలో వెయ్యేళ్ల పురాతన అగస్త్యేశ్వరాలయం ఉంది. ఆలయ గర్భగుడిలోని శివలింగంపై ఏడాదికి ఒకరోజు సూర్యకిరణాలు ప్రసరిస్తుంటాయి. ఆ ప్రకారం బుధవారం ఉదయం 6.30 గంటలకు శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారం రోజులు శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-04-07T15:50:00+05:30 IST