నడక నేర్పించాం.. తొక్కుతూ వెళ్లాడు: Akhileshపై బాబాయ్ ఫైర్

Published: Tue, 03 May 2022 18:38:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నడక నేర్పించాం.. తొక్కుతూ వెళ్లాడు: Akhileshపై బాబాయ్ ఫైర్

లఖ్‌నవూ: Samajwadi Party అధినేత Akhilesh Yadavపై సొంత బాబాయ్ Shivpal Singh Yadav తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్‌ను సంతృప్తి పరిచేందుకు తన ఆత్మగౌరవాన్ని అట్టడుగు స్థాయికి తగ్గించుకున్నానని, అయినా తనకు వేదనే మిగిలిందని ఆయన అన్నారు. Eid సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అఖిలేష్‌పై నిప్పులు చెరిగారు. నడక నేర్పిన తమనే తొక్కుతూ వెళ్లాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్కడా అఖిలేష్ పేరు ప్రస్తావించుకుండా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని tweet ద్వారా వెల్లడించారు.

‘‘అతనిని సంతృప్తి పరిచేందుకు నా ఆత్మగౌరవాన్ని అట్టడుగు స్థాయికి తగ్గించుకున్నాను. అయినా నాకు కోపం వచ్చిందంటే.. అతను నా హృదయాన్ని ఏ మేరకు బాధపెట్టి ఉంటాడు? నడక నేర్పించాం. కానీ మమ్మల్ని తొక్కుతూ వెళ్లాడు’’ అని శివపాల్ యాదవ్ ట్వీట్ చేశారు. చివరిలో Eid mubarak అంటూ రాసుకొచ్చారు.

Mulayam singh yadav తమ్ముడు అయిన శివపాల్ యాదవ్.. 2017 Uttar pradesh అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి విడపోయి Pragatisheel Samajwadi Party పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గుర్తుపై పోటీ చేశారు. దీంతో వీరి మధ్య విబేధాలు ముగిసాయని అనుకున్నారు. ఇంతలోనే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎస్పీ ఎమ్మెల్యేల సమావేశానికి శివపాల్‌ను పిలవకపోవడంతో విబేధాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇంతే కాకుండా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం CM Yogi Adityanathని శివపాల్ కలుసుకోవడం చర్చనీయాంశమైంది. BJPతో ఆయన చేతులు కలపబోతున్నారనే గుసగుసలు వినిపించాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.