Advertisement

శివరాత్రి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు

Mar 6 2021 @ 00:27AM
తప్పుగా ముద్రించబడ్డ ఆహ్వాన పత్రిక


గడివేముల, మార్చి 5: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లోని దుర్గాభోగేశ్వర ఆలయ మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రికలో తప్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతుండగా ఫిబ్రవరి 10న అని అచ్చు తప్పుపడింది. దీంతో భక్తులు ఆలయ అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రింటింగ్‌లో అచ్చుతప్పుపడిందని అన్నారు. దాన్ని సరి చేసి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.