హరహర మహాదేవ...

ABN , First Publish Date - 2022-03-02T13:51:08+05:30 IST

పరమేశ్వరుడికి ప్రీతికరమైన మహా శివరాత్రి రోజైన మంగళవారం రాష్ట్రం లోని శైవక్షేత్రాలు హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగాయి. ముఖ్యంగా కోయంబత్తూరు సమీపం లోని వెల్లయంగిరి ఈషా ఫౌండేషన్‌ ప్రాంతంలో

హరహర మహాదేవ...

- వెల్లయంగిరిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

- ఈషా ఫౌండేషన్‌కు పోటెత్తిన భక్తగణం


చెన్నై: పరమేశ్వరుడికి ప్రీతికరమైన మహా శివరాత్రి రోజైన మంగళవారం రాష్ట్రం లోని శైవక్షేత్రాలు హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగాయి. ముఖ్యంగా కోయంబత్తూరు సమీపం లోని వెల్లయంగిరి ఈషా ఫౌండేషన్‌ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరి సింది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో వెల్లయంగిరి జనసంద్రంగా మారిపోయింది. భక్తుల ఓంకార నాదంతో లయకారుడే తన్మయుడై పోయాడా అన్నంతగా అక్కడ భక్తిభావం వెల్లివిరిసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేందుకు, ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తగా, సద్గురు ప్రబోధం ఓలలాడించింది. ఈ వేడుకల్లో రాజకీయ, సినీరంగాలకు చెందిన ప్రముఖులు, వేలాది మంది భక్తులు పాల్గొనగా, సినీ కళాకారులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తబృందాలు నిర్వహించిన సంగీత కచ్చేరీలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2022-03-02T13:51:08+05:30 IST