పొలతలలో 10 నుంచి శివరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-03-06T04:56:22+05:30 IST

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన పొలతలలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 10 నుంచి మూడురోజుల పాటు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

పొలతలలో 10 నుంచి శివరాత్రి ఉత్సవాలు

పెండ్లిమర్రి, మార్చి 5: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన పొలతలలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 10 నుంచి మూడురోజుల పాటు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. 10న బుధవారం  తెల్లవారుజామున స్వామివారి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 11న ఉదయం 10 గంటలకు ముత్యాల తలంబ్రాలతో మల్లేశ్వరస్వామి కల్యాణం, రాత్రి 9 నుంచి చెక్కభజన, హరికథలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాత్రి 11 గంటలకు నూతనంగా చేయించిన రథంలో స్వామివారి ఆలయం నుంచి అక్కదేవతల గుడి వరకు మల్లేశ్వరస్వామి వారి రథోత్సవం, 12న ఉత్సవ ముగింపు కార్యక్రమం ఉంటాయన్నారు.

Updated Date - 2021-03-06T04:56:22+05:30 IST