శోభన్‌బాబు తర్వాత జగపతి బాబే!

May 23 2021 @ 18:18PM

ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్ర పోషించాలంటే ఆ రోజుల్లో దర్శక నిర్మాతలకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శోభన్‌బాబు. ఆయన కూడా ఆ తరహా పాత్రలు పోషించడానికి అభ్యంతరం చెప్పేవారు కాదు. ఆయనకు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ. అయినా అటువంటి పాత్రల్లో తమ అభిమాన హీరోని చూడడానికి వాళ్లు కూడా ఇష్టపడేవారు. ‘కార్తీక దీపం’తో ప్రారంభించి, ఇలాంటి పాత్రలతో ఎన్నో చిత్రాలలో నటించారు శోభన్‌ బాబు. ఈ చిత్రాల్లో అధిక శాతం విజయవంతమయ్యాయి కూడా. ఆయన తర్వాత అటువంటి పాత్రలను ఎక్కువగా పోషించిన హీరో జగపతిబాబు. ఇప్పుడు ఆయన విలన్‌ పాత్రలను పోషిస్తున్నారు కానీ పాతికేళ్ల క్రితం శోభన్‌బాబులా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు పాత్రలను పోషించేవారు. వాటిల్లో ‘ఆయనకిద్దరు’ చిత్రం ఒకటి. ఈ సినిమాకు ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకుడు. తన సినిమాలకు ఆయన పెట్టే టైటిల్స్‌ తమాషాగా ఉంటాయని వేరే చెప్పాలా! ‘ఆయనకిద్దరు’ చిత్రంలో జగపతిబాబు సరసన రమ్యకృష్ణ, ఊహ నటించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో వీరి ముగ్గురి మీద క్లాప్‌ ఇస్తున్న నాగార్జునని చూడండి.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.