గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎంలకు ఝలక్ ?

ABN , First Publish Date - 2021-05-07T19:00:58+05:30 IST

బజాజ్ ఫైనాన్స్... కొత్త సర్వీసులు లాంచ్ చేయనుంది. బజాజ్ పే సేవలు అందుబాటులోకి తీసుకురావొచ్చని వినవస్తోంది. రిజర్వ్ బ్యాంక్... బజాజ్ ఫైనాన్స్‌కు పీపీఐ అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో... త్వరలోనే కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎంలకు ఝలక్ ?

పూనే : బజాజ్ ఫైనాన్స్... కొత్త సర్వీసులు లాంచ్ చేయనుంది. బజాజ్ పే సేవలు అందుబాటులోకి తీసుకురావొచ్చని వినవస్తోంది. రిజర్వ్ బ్యాంక్... బజాజ్ ఫైనాన్స్‌కు పీపీఐ అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో... త్వరలోనే కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 


పేటీఎం, అమెజాన్ మాదిరిగా బజాజ్ ఫైనాన్స్ కూడా ప్రిపెయిడ్ పేమెంట్ బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. బజాజ్ ఫైనాన్స్‌కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి అనుమతులు కూడా లభించాయి. త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ బజాజ్ పే సర్వీసులు లాంచ్ చేయనుంది. 


బజాజ్ పే సర్వీసులు ప్రారంభమైతే గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర వ్యవస్థలు పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ వాలెట్ సర్వీసులు శాశ్వతంగా కొనసాగించేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఈ క్రమంలో... గతంలో మాదిరిగా ఇక ఏటా ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందాల్సిన అవసరముండబోదు. ఈ క్రమంలో... బజాజ్ ఫైనాన్స్ త్వరలోనే పీపీఐ సర్వీసులు లాంచ్ చేయనుంది. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే... కస్టమర్లు యూపీఐ ద్వారా నగదు లావాదేవీలను నిర్వహించవచ్చు. సెమీ క్లోజ్డ్ ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ కోసం బజాజ్ ఫైనాన్స్‌కు అమతులు లభించాయి. 

Updated Date - 2021-05-07T19:00:58+05:30 IST