విశ్రాంత ఉద్యోగులనూ వదలని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-24T06:19:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు షాకిచ్చేలా నిర్ణయం తీసుకుంటూ ఇటీవలే జీఓ జారీ చేసింది.

విశ్రాంత ఉద్యోగులనూ వదలని ప్రభుత్వం

పెన్షనర్లకు షాక్‌!

క్వాంటమ్‌ పేరుతో వయస్సు పెంపు

నష్టపోనున్న 14 వేల మంది పెన్షనర్లు

ఒక్కో పెన్షనదారుడిపై  రూ. 70 వేల నుంచి  రూ. లక్షదాకా అప్పు

గత డీఆర్‌లకు 23 శాతం ఐఆర్‌ అమలు చేస్తూ రికవరీకి జీఓ జారీ

ప్రభుత్వ నిర్ణయంపై  మండిపడుతున్న పెన్షనదారులు




అనంతపురం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు షాకిచ్చేలా నిర్ణయం తీసుకుంటూ  ఇటీవలే జీఓ జారీ చేసింది. కొత్త వేతన సవరణ ఉత్తర్వుల మేరకు 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న పింఛనదారులకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన మొత్తంలో కోత పెట్టింది. జీఓ నెం.2లో 19.3 నిబంధన మేరకు ఇప్పటికే అదనంగా చెల్లించిన మధ్యంతర భృతిని డీఆర్‌ బకాయిల మొత్తం నుంచి మినహాయిస్తామని ఆ జీఓలో స్పష్టం చేశారు. ఒకవేళ అలా మినహాయించినా ఇంకా సరిపోని పక్షంలో ఆ పెన్షనదారుల నుంచి ప్రభుత్వానికి జమ కావాల్సిన మొత్తం ఉంటే భవిష్యత్తులో ఇచ్చే డీఆర్‌ నుంచి మినహాయించుకుంటామని ప్రభుత్వం చెబుతుండటం  విశ్రాంత ఉద్యోగులకు షాక్‌ ఇచ్చేలా ఉంది. ఆ జీఓ మేరకు జిల్లాలో 14 వేల మంది నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల నేప థ్యంలో ఒక్కో పెన్షనదారుడు రూ. 70 వేల నుంచి రూ. లక్షదాకా ప్రభుత్వానికి బకాయి పడినట్లు ఆ విశ్రాంత ఉద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. గత డీఆర్‌లకు 23 శాతం ఐఆర్‌ అమలు చేస్తూ... రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం గమనార్హం. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల విశ్రాంత ఉద్యోగ పెన్షనదారులకు భారీగా నష్టం వాటిల్లనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెన్షనదారులెవరికీ భవిష్యత్తులో డీఆర్‌ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదన్నది స్పష్టం.  ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ముసలి వయస్సులోనూ ఉద్యమించక తప్పదని ఆ వర్గా లు హెచ్చరిస్తున్నాయి. డెత రిలీ్‌ఫలోనూ ఒకే స్లాబ్‌ను తీసుకురావడం పెన్షనదారులకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో ఆ వర్గాలు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 


 14 వేల మంది పెన్షనర్లకు నష్టం

జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది పెన్షనర్లుండగా... వారిలో 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్కులు దాదాపు రూ. 14 వేల మందికిపైగా ఉన్నారు. వీరందరికి వారి వారి బేసిక్‌ను బట్టి నెలనెలా వచ్చే పెన్షనతో పాటు 10 శాతం అదనపు పెన్షనను పొందుతూ వస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ. 25840 పెన్షన తీసుకునే వారికి అదనపు పెన్షన 10 శాతం రూ. 2584లు కలిపి వచ్చేది. క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన రద్దుతో జిల్లా వ్యాప్తంగా 70 నుంచి 80 ఏళ్లలోపు ఉన్న పెన్షనర్లు భారీగా నష్టపోనున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం-2లో 70 నుంచి 80 ఏళ్ల వరకూ అమలవుతున్న 10 శాతం క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను రద్దు చేస్తూ...  80 ఏళ్ల నుంచి క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను అమలు చేసింది. దీంతో ఆయా పెన్షనర్లు ఒక్కొ క్కరు దాదాపు రూ. 3 వేల నుంచి వారి వారి పెన్షనను బట్టి వేలల్లోనే నష్టపోనున్నారు. 73 నుంచి 80 ఏళ్లలోపు పెన్షనర్లు దాదాపు రూ. 40 వేల నుంచి రూ. లక్ష వరకూ పెన్షన తీసుకునే వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ ఒక్కొక్కరు రూ. 4 వేల నుంచి రూ. 10 వేలు నెల నెలా పెన్షనలో నష్టపోనున్నారు.


భవిష్యత్తులో డీఆర్‌లు లేనట్లే...!

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది ఆరంభం నుంచే అమలయ్యే డీఆర్‌లు పెన్షనర్లకు లేనట్లేనన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇదివరకూ ఐఆర్‌ 27 శాతం, డీఆర్‌ 33.536 శాతంతో కలిపి పెన్షన్ల రూపం లో డబ్బులు అందేవి. తాజాగా ఆ డీఆర్‌ను 30.392 శా తం, ఐఆర్‌ 23 శాతానికి తగ్గించింది. వీటితో పాటు క్వాం టమ్‌ ఆఫ్‌ పెన్షనను తొలగించింది. అయితే ఇక్కడే ఓ మె లిక పెట్టింది. 2019 జూన నుంచి 27 శాతం ఐఆర్‌, 33.596 డీఆర్‌తో  కలిపి పెన్షనలు ఇచ్చాం కదా... వాటికీ ప్రస్తుతం ఇచ్చిన 23 శాతం ఐఆర్‌, 30.392 శాతం డీఆర్‌ తోనే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం జీఓను జారీ చేసిం ది. అంటే జూన 2019 నుంచి ఐఆర్‌ 4 శాతం, డీఆర్‌ 3.204 శాతం పెన్షనను తిరిగి వెనక్కివాలని ఆ జీఓ సారాంశం. ఈ లెక్కన ఉదాహరణకు రూ. 25,840 పెన్షన తీసుకునే ఒక్కో పెన్షనర్‌ రూ. 70,939లు తిరిగి ప్రభుత్వా నికి చెల్లించాలని ఆ జీఓలో చూపించింది. ఎక్కువ శాతం లో పెన్షనను తీసుకునే పెన్షనదారుల నుంచి రూ. లక్షల్లోనే రికవరీ చేయనున్నారు. ఈ రికవరీని వచ్చే డీఆర్‌ల నుంచి తీసుకోనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల నుంచి అమలయ్యే డీఆర్‌లు దాదాపు పెన్షనర్లు మరిచి పోవాల్సిందే. 


డెత రిలీఫ్‌ల్లోనూ కోత....

పెన్షనదారుడు మృతి చెందితే రూ. 15 వేలు డెత రిలీఫ్‌ కింద ఇచ్చేవారు. రూ. 15 వేలలోపు పెన్షనలు తీసు కునే పెన్షనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తించేది. ఆపై పెన్షన పొందే వారు ఎవరైనా మృతి చెందితే...  నెల నెలా వారు తీసుకునే పెన్షనకు డీఆర్‌, ఇతర అలవెన్సులు కలిపి ఒక నెల పింఛన ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం జా రీచేసిన జీఓలో డెత రిలీ్‌ఫలో కోత పెట్టారు. అన్ని కేట గిరీల పెన్షనర్లకు ఒక్కటే నిబంధన తీసుకొచ్చారు. పెన్షన ర్లు ఎవరు మృతి చెందినా డెత రిలీఫ్‌ కింద రూ. 20 వేలు మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకూ పెన్షన తీసుకునే పెన్షనర్ల కుటుంబాలు భారీ స్థాయిలో నష్టపోనున్నాయి. అధికారిక లెక్కల మేరకు జిల్లాలో రూ. 30 వేల నుంచి రూ. 90 వేల వరకూ పెన్షన తీసుకునే పెన్షనర్లే అధికంగా ఉన్నట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రస్తుతం వారందరికి ఈ డెతరిలీఫ్‌లో కోత పడనుంది. 



రూ. 4 వేల నుంచి 5 వేలు నష్టపోవాల్సిందే: శేషారెడ్డి, పెన్షనర్‌

నేను ప్రతి నెలా రూ. 32,708 పెన్షనను తీసుకుంటు న్నా. నా వయస్సు 72 ఏళ్లు. ఇంతకుమునుపు డీఏ, ఐఆర్‌ లతో కలిపి క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన కింద 10 శాతంతో రూ. 4 వేలు తీసుకునేవాడిని. ఇప్పుడున్న క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను 80 ఏళ్లకు చేశారు. ఈ నెల నుంచే అమవుతుం దన్నారు. అంటే వచ్చే నెల నా పెన్షనలో రూ. 4 వేలు కోత పడినట్లే. ఇప్పటికే కుటుంబసభ్యులు, ఇంటి పోషణ, వైద్యం తదితర ఖర్చులకే పెన్షన మొత్తం సరిపోతోంది. ఇక అందులోనూ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను తీసేస్తే ఎలా... దిస్‌ ఈజ్‌ నాట్‌ కరెక్ట్‌... సీఎం జగన్మోహనరెడ్డి ఇంకొకసారి ఆలోచించాలి. 



పెన్షనర్ల ఊపిరి తీసేసినట్లే

పెన్షనర్లకు అందించే క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన తీసేయ డమంటే పెన్షనర్ల ఊపిరి తీసేసినట్లే. 70 ఏళ్ల నుంచి 10 శాతం చొప్పున అందించే క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను 80 ఏళ్ల నుంచి మొదలు పెట్టడం దారుణం. 80 ఏళ్లనుంచి అమలంటే ఆ వయస్సులో పెన్షనర్లు 5 శాతం బతికి ఉండరు. అంటే ప్రభుత్వం పూర్తిగా పెన్షనర్లకు అందించే పెన్షన్లను లాక్కొనే కుట్ర చేస్తోంది. ఇప్పటికే హెల్త్‌ స్కీమ్‌, రీయింబర్స్‌మెంట్‌ తీసేసి సగం ప్రాణం తీసేశారు.. ఇప్పుడు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన, చనిపోయిన పెన్షనర్లకు రూ. 20 వేలు ఇస్తామంటూ జీఓను జారీ చేసి పూర్తిగా చంపే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే పాత పద్థతిలోనే ఐఆర్‌ 27 శాతంతో పెన్షనలు అందించడంతో పాటు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను 70 ఏళ్ల నుంచి అమలు చేయాలి. లేదంటే సీఎం జగన్మోహనరెడ్డికి పెన్షనర్లు, వారి కుటుంబసభ్యుల ఉసురు తప్పదు. 

- పెద్దనగౌడ్‌, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు


చనిపోయినోళ్ల పెన్షనలో కోత పెట్టడం బాధాకరం

ఇదివరకూ ఏ పెన్షనర్‌ అయినా చనిపోతే.. డెత రిలీఫ్‌ కింద వారు ఎంత పెన్షన తీసుకుంటున్నారో దానికి  డీఆర్‌, ఇతర అలవెన్సులు కలుపుకొని ఒక నెల పెన్షనను కుటుంబసభ్యులకు అందించేవారు. రూ. 15 వేల లోపు పెన్షన తీసుకునే పెన్షనర్‌కు కూడా రూ. 15 వేలు కుటుంబసభ్యులకు అందించే వారు. ఆపైన రూ. 50 వేలు కావచ్చు, లక్ష కావచ్చు. ఎంత పెన్షన పొందుతున్న పెన్షనర్‌ మర ణించినా ఆ కుటుంబసభ్యులకు ఒక నెల పెన్షనను డెత రిలీఫ్‌ కింద అందించేవారు. తాజాగా విడుదల అయిన జీఓలో ఎంత పెన్షన తీసుకున్నా డెత రిలీఫ్‌ కింద రూ. 20 వేలు ఇస్తామనడం బాధాకరం. ఈ విషయంపై సీఎం జగన్మోహనరెడ్డి పునరాలోచించాలి. 

-  రామకృష్ణ, పెన్షనర్‌

Updated Date - 2022-01-24T06:19:49+05:30 IST