ఫోన్ పే వాడే వారికి షాక్..!

Published: Sun, 24 Oct 2021 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫోన్ పే వాడే వారికి షాక్..!

హైదరాబాద్ : ఫోన్ పే ద్వారా మొబైల్ రీచార్జ్ చేస్తున్నట్లైతే...   కంపెనీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు వినవస్తోంది. సాధారణంగా... అమెజాన్ లేదంటే పేటీఎం... ఇలా ఆన్‌లైన్‌లో ఏ విధంగా మొబైల్ రీచార్జ్ చేసుకున్నప్పటికీ కూడా అదనపు చార్జీలు పడవన్న విషయం తెలిసిందే. అయితే ఫోన్ పే మాత్రం ఫోన్ రీచార్జ్‌పై రూ. 2 వరకు అదనపు చార్జీని వసులు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ చార్జీల అములను పరీక్షిస్తోంది. కొంతం మంది ఫోన్ పే యూజర్లకు ఈ విధంగా అదనపు చార్జీలు పడుతున్నాయి.


అయితే అందరికీ ఈ చార్జీల విధింపు లేదని సమాచారం. ఈ నేపధ్యంలో ఫోన్ పే యూజర్లు ఈ విషయాన్ని గమనించాలి. ఫోన్ పే ప్రాసెసింగ్ ఫీజు లేదా కన్వీనియన్స్ ఫీజు కింద ఈ మేరకు చార్జీలు వసూలు చేస్తోంది. రూ. 1-రూ. 2 వరకు తీసుకుంటోంది. యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వాలెట్ ఇలా మీరు ఎలా రీచార్జ్ చేసినా చార్జీలు పడతాయి. రూ. 50 నుంచి రూ. 100 వరకు రీచార్జ్‌పై రూ. 1, రూ.  100 కు పైన రీచార్జ్‌పై రూ. 2 వసూలు చేస్తోందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం ప్రయోగాత్మకమేనని, ఇంకా ఈ విషయమై ఎటువంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.