అతడికి భార్య లేదు.. ఆమెకు భర్త లేదు.. ఇద్దరికీ రెండో పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు.. 4 నెలల తర్వాత ఊహించని ఘటన..!

ABN , First Publish Date - 2021-11-18T19:15:49+05:30 IST

ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.. అతనూ తన భార్య నుంచి విడిపోయాడు..

అతడికి భార్య లేదు.. ఆమెకు భర్త లేదు.. ఇద్దరికీ రెండో పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు.. 4 నెలల తర్వాత ఊహించని ఘటన..!

ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.. అతనూ తన భార్య నుంచి విడిపోయాడు.. ఇద్దరూ నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.. ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది.. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే ఆమె చనిపోయింది.. అది ఆత్మహత్య అని భర్త నమ్మించడానికి ప్రయత్నించాడు.. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. భర్త చేతిలోనే భార్య హతమైందని తేలింది.. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 


రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన కుల్దీప్ నాలుగు నెలల క్రితం పిస్తా బాయి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ అది రెండో వివాహమే. అయితే నాలుగు నెలలు గడిచేసరికి పిస్తా బాయి మరణించింది. భార్య ఆత్మహత్య చేసుకుందని కుల్దీప్ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె తల్లిదండ్రులు నమ్మలేదు. పోలీసులను ఆశ్రయించి కుల్దీప్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుల్దీప్‌ను విచారించారు. 


విచారణ‌లో కుల్దీప్ నిజం అంగీకరించాడు. తానే భార్యను చంపేసినట్టు తెలిపాడు. పెళ్లి సమయంలో పిస్తా బాయి బంగారం ధరించి ఉందని, ఇటీవల ఆ బంగారాన్ని పుట్టింట్లో తిరిగి ఇచ్చేసిందని, అలా చేయవద్దని తాను అడిగినా ఆమె తన మాట వినలేదని, అందుకే ఆమెను హత్య చేశానని కుల్దీప్ చెప్పాడు. దీంతో కుల్దీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-11-18T19:15:49+05:30 IST