SHOCKING: విమానంలో పాకిస్థానీ ప్రయాణికుడి హల్‌చల్.. కిటికీ అద్దాన్ని విరగ్గొట్టి వీరంగం!

ABN , First Publish Date - 2022-09-19T22:49:57+05:30 IST

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) విమానంలో ఓ పాకిస్థానీ ప్రయాణికుడు చెలరేగిపోయాడు.

SHOCKING: విమానంలో పాకిస్థానీ ప్రయాణికుడి హల్‌చల్.. కిటికీ అద్దాన్ని విరగ్గొట్టి వీరంగం!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) విమానంలో ఓ పాకిస్థానీ ప్రయాణికుడు చెలరేగిపోయాడు. నానా రభస చేశాడు. పెషావర్ (Peshawar) నుంచి దుబాయ్(Dubai) వెళ్తున్న విమానం పీకే-283లో ప్రయాణికుడు ఒక్కసారిగా గందరగోళం సృష్టించాడు. సీట్లపైకి ఎక్కి వాటిని తంతూ నానా రభస చేశాడు. ఆ తర్వాత సీట్లపై నుంచి నడుస్తూ విమానం కిటికీ అద్దాన్ని కాలితో తన్ని విరగ్గొట్టాడు. 


విమానంలోకి ఎక్కినంత వరకు అతడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాతే అతడు వికృతంగా ప్రవర్తించాడని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా సరే వినకుండా నానా యాగీ చేశాడు. అయితే, విమానంలో నమాజ్ (Namaz ) చేసుకోకుండా అడ్డుకోవడం వల్లే అతడు అలా ప్రవర్తించాడని మరికొందరు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి హల్‌చల్ చేస్తోంది.



Updated Date - 2022-09-19T22:49:57+05:30 IST