పెనుగొండలో సంపూర్ణేష్‌బాబు సందడి

ABN , First Publish Date - 2021-03-09T06:50:35+05:30 IST

పెనుగొండ నగరేశ్వర మహిషాసుర మర్ధని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో సినీ హీరో సంపూర్ణేష్‌బాబు సినిమా షూటింగ్‌తో సోమవారం సందడిగా మారింది.

పెనుగొండలో సంపూర్ణేష్‌బాబు సందడి
హీరో, హీరోయిన్‌పై పాట చిత్రీకరణ

 పెనుగొండ, మార్చి 8: పెనుగొండ నగరేశ్వర మహిషాసుర మర్ధని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో సినీ హీరో సంపూర్ణేష్‌బాబు సినిమా షూటింగ్‌తో సోమవారం  సందడిగా మారింది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. చిత్రంలో హీరోయిన్‌గా వందన నటిస్తున్నారు. మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ఆర్‌కె.మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ చూసేందుకు అధిక సంఖ్యలో  ప్రజలు  తరలి రావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. 

Updated Date - 2021-03-09T06:50:35+05:30 IST