కూతురితో మాట్లాడాడని డ్రైవర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి..!

ABN , First Publish Date - 2022-05-30T14:47:54+05:30 IST

కూతురితో (Daughter) మాట్లాడాడని తన వద్ద డ్రైవర్‌గా (Driver) పని చేసిన ...

కూతురితో మాట్లాడాడని డ్రైవర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి..!

  • డ్రైవర్‌పై యజమాని కుటుంబీకుల దాడి
  • వేధిస్తున్నాడని కూతురు ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : కూతురితో (Daughter) మాట్లాడాడని తన వద్ద డ్రైవర్‌గా (Driver) పని చేసిన వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్ర చౌరస్తా ప్రాంతానికి చెందిన సోంబాబు (35) నాలుగేళ్లుగా ఓల్డ్‌ బోయినపల్లిలోని ఉన్న ఫర్నిచర్‌ దుకాణంలో డ్రైవర్‌. యజమానికి నలుగురు కుమార్తెలున్నారు. వారిలో ఒకామె కొంతకాలంగా సోంబాబుతో మాట్లాడుతోందని, ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయని తెలుసుకున్న యజమాని అతడిని పనిలో నుంచి తొలగించాడు.


కాగా.. ఫర్నిచర్‌ షాపు యజమాని కూతురు (22) ఎంబీఏ చదువుతోంది. అయితే తన తండ్రి వద్ద ఆటో డ్రైవర్‌గా, వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సోంబాబు తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడని పోలీసులకు (Police) ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి షాపు వద్దకు వచ్చి తనను కలిసే ప్రయత్నం చేయడంతో పాటు ప్రేమించకుంటే కత్తితో (Knife) కోసుకుంటానని బెదిరించాడని పేర్కొంది. భయంతో విషయం చెప్పడంతో తల్లి, చెల్లెళ్లు (Sisters) వచ్చి అతడిని మందలించారని పేర్కొంది. కోపంతో రగిలిపోయిన సోంబాబు తన తండ్రిని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది.


చాలా రోజుల తర్వాత సోంబాబు మళ్లీ ఆ షాపునకు వెళ్లాడు. తనకు సంబంధించిన కూలర్‌ ఒకటి షాపులో ఉండిపోయిందని, దాన్ని తీసుకెళ్లడానికి వచ్చానని యజమానికి చెప్పాడు. అతడిపై అనుమానం పెంచుకున్న యజమాని మంచిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి సోంబాబు కళ్లలో కారంపొడి చల్లి రూమ్‌లో బంధించి, తీవ్రంగా కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు బోయినపల్లి పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2022-05-30T14:47:54+05:30 IST