డిస్కౌంట్ సేల్ అని షాప్‌కు పోటెత్తిన జనం.. షాప్‌ను మూసివేసిన అధికారులు

ABN , First Publish Date - 2021-03-07T10:12:05+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యాపారాలు నడుపుకునేందుకు ఏ దేశానికాదేశం అనుమతులిచ్చింది.

డిస్కౌంట్ సేల్ అని షాప్‌కు పోటెత్తిన జనం.. షాప్‌ను మూసివేసిన అధికారులు

దుబాయి: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యాపారాలు నడుపుకునేందుకు ఏ దేశానికాదేశం అనుమతులిచ్చింది. యూఏఈ ప్రభుత్వం సైతం వ్యాపారాలను తెరుచుకునేందుకు చాలా నెలల క్రితం అనుమతులను జారీ చేసింది. అయితే కరోనా నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకు అనేక షాపింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంది. తాజాగా దుబాయిలోని ఓ షాపింగ్ మాల్ కరోనా నిబంధనలను పాటించకపోవడంతో షాప్‌ను మూసివేయడమే కాకుండా యజమానికి అధికారులు 5 వేల దిర్హామ్‌ల జరిమానా విధించారు. 


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మన్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ మాల్ డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రకటించింది. దీంతో వందలాది మంది కస్టమర్లతో షాప్ నిండిపోయింది. శనివారం ఈ షాప్‌కు వచ్చిన వారిలో ఏ ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడంతో అధికారులు వెంటనే షాపింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. వెంటనే కస్టమర్లను బయటకు పంపేసి షాప్‌ను మూసివేశారు. కరోనా నిబంధనలను పాటించకపోవడంతో భారీ జరిమానాను విధించారు. కరోనా నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు మరోసారి గుర్తుచేశారు. 

Updated Date - 2021-03-07T10:12:05+05:30 IST