Police Announcement: సాయంత్రం 7 కల్లా దుకాణాలు మూసేయాలి

ABN , First Publish Date - 2022-08-25T00:53:10+05:30 IST

Hyderabad: గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అయనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. పోలీసులు నిబంధనలు ప్రకారం నడుచుకోలేదని రాజాసింగ్ తరపు

Police Announcement: సాయంత్రం 7 కల్లా దుకాణాలు మూసేయాలి

Hyderabad: గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అయనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. పోలీసులు నిబంధనలు ప్రకారం నడుచుకోలేదని రాజాసింగ్ తరపు లాయర్ వాదించారు. దీంతో రిమాండ్‌ను రిజెక్టు చేస్తూ.. కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శాలిబండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లజెండాలతో ఆందోళనకారులు (Protesters) రోడ్డు మీదకు వచ్చారు. వారిని  పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ముందు జాగ్రత్తగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు మరిన్ని భద్రతా బలగాలను మోహరించారు. కాగా పాత బస్తీ  అలజడిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే పాతబస్తీ ఘటనలపై  సీఎం కేసీఆర్ సమీక్షించారు. పాత బస్తీ, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలన్నింటిని బంద్ చేయాలని పోలీసు వాహనాల్లో తిరుగుతూ మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-25T00:53:10+05:30 IST