సచివాలయాల్లో కుర్చీల కొరత

ABN , First Publish Date - 2020-07-06T10:13:00+05:30 IST

పట్టణంలో 16 సచివాయాలకు పదేసి చొప్పున కుర్చీలను ప్రభు త్వం పంపిణీ చేయడంతో వలంటీర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సచివాలయాల్లో కుర్చీల కొరత

బొబ్బిలి :  పట్టణంలో  16 సచివాయాలకు పదేసి చొప్పున కుర్చీలను ప్రభు త్వం పంపిణీ చేయడంతో వలంటీర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నేలపై కూర్చొని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పొరపాటున వలంటీర్లు కుర్చీలో కూర్చుంటే కార్యదర్శులు కన్నెర్ర చేస్తున్నారు.  పట్టణ పరిధి లోని 14, 18 వార్డులకు చెందిన కుమ్మరివీధి సచివాలయంలో తరచూ ఇదే సమస్య ఏర్పడుతోంది. ఇక్కడ 8 మంది సచివాలయ ఉద్యోగులతో పాటు 24 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ పది కుర్చీలు మాత్రమే ఉన్నాయి.  దీంతో వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు తరచూ గొడవలు పడడం సర్వ సాఽధారణమైపోయింది.  అసలు ప్రతి సచివాలయంలో అడ్మినిస్ర్టేటివ్‌ కార్యదర్శితో పాటు ప్లానింగ్‌, వెల్ఫేర్‌, శానిటేషన్‌, ఎమినిటీస్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌, హెల్త్‌ కార్యదర్శులతో పాటు డిజిటల్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.


  వీఆర్‌వో కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ప్రతి సచివాలయానికి అడ్మిన్‌ ప్రధాన అధికారి అయి నప్పటికీ కొన్ని సచివాలయాల్లో  మిగిలిన ఉద్యోగులు వారి ఆదేశాలు, సూచనలను పెడిచెవిన పెడుతున్నారు.  కుమ్మరివీధి సచివాలయంలో వలంటీర్ల ఆరోపణలపై వెల్ఫేర్‌ కార్యదర్శి శశిభూషణ్‌ను ప్రశ్నించగా తమ సచివాలయంలో అందరూ మహిళా ఉద్యోగులేనని,  వారిని సమన్వయపరిచేందుకు ప్రయత్నిస్తున్నానని తెలి పారు. చాలీచాలని కుర్చీలు ఉండడంతో నేలపై కూర్చొని పనిచేసుకోవాలని సూచిం చినట్లు తెలిపారు.  ఎవరినీ ఇబ్బందులు పెట్టడం లేదన్నారు.  సచివాలయాల్లో చిన్నపాటి సమస్యలు నెలకొన్న వెంటనే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు తెలిపారు.  కుర్చీల సమస్య ఉన్నమాట వాస్తవమేనని,  పదిమంది కన్నా ఎక్కువ మంది వలంటీర్లు ఉన్న చోట అదనపు కుర్చీలు కావాలని ప్రతిపాదనలు పంపామని స్పష్టం చేశారు.  వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ నియమావళిని పాటించాల్సిందేనని తెలిపారు. 

Updated Date - 2020-07-06T10:13:00+05:30 IST