ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరత

ABN , First Publish Date - 2021-11-27T06:08:27+05:30 IST

ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరతతో పీహెచ్‌సీల్లో శ్వాబ్‌ నమూనాల సేకరణ జరగడం లేదు.

ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరత

శ్రీకాళహస్తి, నవంబరు 26: కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్‌పడింది. ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరతతో వారం రోజులుగా పీహెచ్‌సీల్లో శ్వాబ్‌ నమూనాల సేకరణ జరగడం లేదు. కొన్నిచోట్ల అరకొరగా సరఫరా అవడంపై వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అత్యవసర పరిస్థితి ఏర్పడిన బాధితుల శ్వాబ్‌ నమూనాలు మాత్రమే ఇక్కడి వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. శుక్రవారం కూడా తక్కువ సంఖ్యలో కిట్లు సరఫరా అయినట్లు తెలిసింది. పట్టణంలోని రెండు అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో నిత్యం కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరతతో వారం రోజులుగా ఇక్కడా శ్వాబ్‌ నమూనాల సేకరణకు బ్రేక్‌పడింది. దగ్గు, జ్వరంతో బాధపడుతూ పీహెచ్‌సీలను ఆశ్రయించే గ్రామీణప్రాంతాల ప్రజలు కిట్లు అందుబాటులో లేకపోవడం తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు. 

Updated Date - 2021-11-27T06:08:27+05:30 IST