Advertisement

స్టాంపుల కొరత.. ఆగిన రిజిస్ట్రేషన్లు

Feb 25 2021 @ 23:45PM
స్టాంపుల కొరతతో రిజిస్ట్రేషన్లు లేక వెలవెలబోతున్న సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

మూడు నెలలుగా స్టాంపులు లేక వెలవెలబోతున్న రిజిస్ట్రేషన ఆఫీసులు 

స్టాంపుల్లేక ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు చేసుకోలేక విద్యార్థుల అవస్థలు

రాజంపేట, ఫిబ్రవరి 25: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో నాన జుడీషియల్‌ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. మూడు నెలలుగా స్టాంపుల కొరత ఏర్పడటంతో రిజిస్ట్రేషన్లు చేసుకోలేక వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. రాజంపేటలో స్టాంపుల కొరత వల్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యవసరమైనవారు రైల్వేకోడూరు, రాయచోటి, సిద్దవటం ప్రాంతాల్లో నాన జుడీషియల్‌ ఓల్డ్‌స్టాక్‌ ఉన్న వెండర్ల వద్దకు వెళ్లి ఐదింతల ఎక్కువ రేటు పెట్టి స్టాంపులు కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా దొరక్కపోవడంతో పలువురు ఇబ్బంది పడుతున్నారు.


నోస్టాక్‌ బోర్డులు

రాజంపేట సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో రోజువారి సుమారు 50 పైబడి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రస్తుతం రిజిస్ర్టేషన్లు పది కూడా జరగడం లేదు. అప్పుడప్పుడు రూ.10 స్టాంపులు దొరుకుతున్నా 20, 50, 100 స్టాంపులు మూడు నెలలుగా దొరకడం లేదు. దీని వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గి సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం వెలవెలబోతోంది. సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో స్టాంపులు అమ్మే చోట నో స్టాక్‌ బోర్డు పెట్టి రిజిస్ట్రేషన అధికారులు చేతులెత్తేశారు. దీని వల్ల స్టాంపు వెండర్లు, స్టాంపులు రాసే వారు ఇబ్బంది పడుతున్నారు. 


ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులు

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాయితీలు కావాలంటే 10, 20 రూపాయల స్టాంపుల మీద ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ కేస్ట్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంది. జనన, మరణ, కుటుంబ సర్టిఫికెట్లు కావాలన్నా ఈ స్టాంపులపై వాటిని నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. స్టాంపులు మూడు నెలలుగా దొరక్కపోవడంతో సంబంధిత విద్యార్థులు సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.


మూడు నెలలుగా కొరత ఉంది

- మహమ్మద్‌ అజీజుల్లా, రాజంపేట సబ్‌ రిజిస్ర్టార్‌

మూడు నెలలుగా జిల్లా అంతటా స్టాంపుల కొరత ఉంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తెల్లకాగితంపై కూడా ఒప్పంద పత్రం రాసుకొని ఇరువర్గాలు సంతకాలు పెట్టి తగిన పైకాన్ని బ్యాంకులో చలానా కట్టి రిజిస్ట్రేషన చేసుకునే సౌకర్యం ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రజలు నాన జుడీషియల్‌ స్టాంపుల మీద ఒప్పంద పత్రాలు రాసుకుంటేనే అంగీకరిస్తున్నారన్నారు. 10 రూపాయల స్టాంపులను రెండు రోజుల్లోపల వెయ్యికి పైగా తెప్పిస్తున్నాం. మిగిలిన స్టాంపులను కూడా త్వరలోనే తెప్పిస్తాం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.