Delhi air pollutionకు రైతులు పంట వ్యర్థాలను కాల్చడమే కారణం..నాసా తీసిన చిత్రంలో వెల్లడి

ABN , First Publish Date - 2021-11-19T15:45:02+05:30 IST

ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరగడానికి దారితీసిన వ్యవసాయ మంటల చిత్రాలను అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం షేర్ చేసింది...

Delhi air pollutionకు రైతులు పంట వ్యర్థాలను కాల్చడమే కారణం..నాసా తీసిన చిత్రంలో వెల్లడి

ఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరగడానికి దారితీసిన రైతులు పంట వ్యర్థాలను కాలుస్తున్న చిత్రాలను అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం షేర్ చేసింది. ఈ చిత్రంలో వ్యవసాయ పొలాల్లో గోధుమ పొట్టు కాల్చడానికి రైతులు పెట్టిన మంటలను చిన్న ఎరుపు చుక్కలతో హాట్‌పాట్‌లుగా నాసా చిత్రంలో చూపించింది. దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అధిక స్థాయిలో వాయు కాలుష్యంతో జనం సతమతమవుతున్నారు. ఈ నెల 11వతేదీన సుయోమి ఉపగ్రహంలో విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్  ద్వారా ఈ చిత్రాలను తీశామని నాసా తన బ్లాగ్‌లో తెలిపింది.ఉత్తర భారతదేశంలో గోధుమ పంటల మంటల నుంచి వచ్చిన పొగ ఢిల్లీని కప్పివేసింది. 


ఈ మంటలు ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరగడానికి దోహదపడిందని నాసా పేర్కొంది. ఢిల్లీలో 22 మిలియన్ల మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడ్డారని అంచనా వేసినట్లు నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని రీసెర్చ్ అసోసియేషన్ శాస్త్రవేత్త పవన్ గుప్తా చెప్పారు.సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ రీసెర్చ్ ప్రకారం ఢిల్లీలోని గాలి నాణ్యత శుక్రవారం వరుసగా ఆరవ రోజు కూడా చాలా పేలవమైన కేటగిరీలో కొనసాగుతోంది.అయితే మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం ఏక్యూఐ 362 నుంచి నేడు 332 ఏక్యూఐకి తగ్గింది.ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఈ నెల 21వతేదీ వరకు నిత్యావసర సరుకులను తరలించే ట్రక్కులు మినహా ఇతర లారీలు ప్రవేశించకుండా నిలిపివేశారు.


Updated Date - 2021-11-19T15:45:02+05:30 IST