మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-09-25T06:03:54+05:30 IST

మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, న్యాయమూర్తి షేక్‌ షిరీన్‌ అన్నారు.

మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి షిరీన్‌

న్యాయమూర్తి షేక్‌ షిరీన్‌

మైలవరం, సెప్టెంబరు 24: మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, న్యాయమూర్తి షేక్‌ షిరీన్‌ అన్నారు. లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం మహిళలు, యువత భద్రత అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ప్రతిచోట మహిళలకు గౌరవం ఇవ్వాలని, కానీ సినిమాల ప్రభావం వల్ల సోషల్‌ మీడియా వల్ల మహిళలను అగౌరవ పరుస్తున్నారన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ ఫ్రెండ్లీ పోలీస్‌కు సహకరించాలన్నారు.  ఆపదలో ఉన్నప్పుడు 100,112లకు కాల్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌ కె.హరినాథ్‌రెడ్డి, ఐసీసీ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ పి.శోభారాణి,  జి.తబిత, కె.శ్రీదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T06:03:54+05:30 IST