చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలి

ABN , First Publish Date - 2022-06-25T04:02:34+05:30 IST

జిల్లాలోని వట్టివాగు, కుమరంభీం ప్రాజెక్టుల ద్వారా రైతులకు చివరి ఆయ కట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 24: జిల్లాలోని వట్టివాగు, కుమరంభీం ప్రాజెక్టుల ద్వారా రైతులకు చివరి ఆయ కట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌రాజేశంతో కలిసి జిల్లావ్యవసాయ, నీటిపారు దల, బ్యాంకు ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెలిమెల వాగు డిస్ట్రిబ్యూటరీ, గంగారాం చెరువు, మైనర్‌ ప్రాజెక్టుల కాలువ మర మ్మతు పనులకు అనుమతులు మంజూరయ్యాయ న్నారు. పనులుచేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వాటర్‌ ట్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. పీపీ రావు ప్రాజెక్టు ద్వారా వానాకాలం, యాసంగిపంటలకు సాగునీరుఅందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ట్యాంక్‌లు, కాలువలు, బోర్‌వెల్‌ల కింద సాగయ్యే పంటల వివరా లతో పూర్తి నివేదికను వారం రోజుల్లోగా అందించాల న్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి లక్ష ఎరాలకు సాగునీరందించే విధంగా పూర్తికార్యాచరణ రూపొం దించాలన్నారు. వర్షాకాలం కావడంతో పిడుగుపాటు ప్రమాదాలనుంచి అప్రమత్తంగా ఉండే విధంగా రైతు లకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి మండ లాధికారి వద్ద వారి మండలానికి సంబంధించిన రైతుల, భూములు, పంటలు, రైతుబంధు ఇతర పూర్తివివరాలు ఉండాలని తెలిపారు.

Updated Date - 2022-06-25T04:02:34+05:30 IST