వారం రోజుల్లో పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-30T05:16:57+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల ను వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు.

వారం రోజుల్లో పరిష్కరించాలి
ఫిర్యాదులను స్వీకరిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

- ప్రజావాణికి 57 దరఖాస్తులు

- మండలంలోనే పరిష్కరిస్తే జిల్లా దాకా రావు

- ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), నవంబ రు 29 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల ను వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు.వివిధ సమస్యలపై ప్ర జావాణి కార్యక్రమానికి 57 మంది ఫిర్యాదు (దరఖాస్తులు) చేసుకున్నారని, త్వరగా పరి ష్కరించి ఫిర్యాదుదారునికి ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో ఆయన మరో అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావుతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మండల స్థాయిలో అధికారులు ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తే అవి జిల్లా స్థాయికి రావని అన్నా రు. తహసీల్దారు, ఎంపీడీవో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్ర త్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు. అటవీశాఖ చెట్లను అడ్డగోలుగా నరికి ఇటుక బట్టీలకు అమ్ముతున్నారని తెలంగాణ మాలమ హానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి ప్రజావాణిలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోని రాజ్‌వీర్‌ ఇండస్ట్రీ (స్పిన్నింగ్‌ మిల్లు) తమను తొలగించరాదని పలువురు కూలీలు ప్రజావా ణిలో అఽధికారులకు మొరపెట్టుకున్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి నడుస్తు న్న పరిశ్రమలో 300 మందిమి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు యాజమాన్యం కేవలం 100 మందికి మాత్రమే పని చేసేందుకు అనుమతి ఇస్తామని, మిగతా వారిని వద్దని చెప్పడం వల్ల ఉపాఽధి పోతుందని పేర్కొన్నారు. మమ్ములను యధావిధిగా పనిచేసేవిధంగా అను మతించాలని వారు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిష త్‌ సీఈవో జ్యోతి, డీఆర్‌డీవో, యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.


ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), నవంబరు 29 : ఈ యాసంగిలో వరి కి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ సమావేశ మం దిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు విషయం లో ప్రత్యేక అధికారులు కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పారా బాయిల్డ్‌ రైస్‌ను కొనుగోలు చేయబోమని స్పష్టం చేసి నందున ఈ యాసంగిలో రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంట ల సాగుపై దృష్టి సారించేలా చూడాలని సంబంధిత శాఖల అఽధికా రులకు సూచించారు. వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కూడా దృష్టి సారించాలని, మండలాలకు వెళ్లినప్పుడు పాఠశాలలను, హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల చదువు, భోజనం తదితర అంశాలను తనిఖీ చే యాలని తెలిపారు. మరో కొవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో అం దరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం, ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు మాట్లాడుతూ ధరణి దరఖాస్తులు 133 పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తూ, పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేయాలని కోరారు. పోడు భూముల దరఖా స్తులను బుధవారం లోపు అప్‌లోడ్‌ చేయాలని తహసీల్దార్‌లను ఆదేశిం చారు. అంతకు ముందు ఆయన వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ 


మహబూబ్‌న గర్‌, నవంబరు 29 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీ స్‌శాఖ చిత్త శుద్ధి తో పని చేస్తుందని ఎస్పీ ఆర్‌ వెంక టేశ్వర్లు అన్నారు. పేద ప్రజలకు ఎ ప్పటికీ అండగా ఉంటుందని భరో సా ఇచ్చారు. సోమవారం ప్రజా ఫిర్యాదులలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే బాధి తుల పట్ల పోలీ సులు మర్యాదగా వ్యవహరించాలని, వారిలో భరోసా కల్పించాలని, విచారణ అధికారి క్షేత్రస్థాయికి వెళ్లడం వల్ల కేసు విచారణ పారద ర్శకంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గొడవలు జరిగే ప్రాంతాలు, గ్రామాలపై పోలీసులు ముందుగానే నిశిత దృష్ఠి సారించా లన్నారు.  ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత అఽధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించారు. 



Updated Date - 2021-11-30T05:16:57+05:30 IST