గడువులోపు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-26T05:39:02+05:30 IST

స్పందన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.

గడువులోపు పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

  1. స్పందన అర్జీలపై కలెక్టర్‌ ఆదేశాలు


కర్నూలు(కలెక్టరేట్‌), అక్టోబరు 25: స్పందన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందనలో భూ సమస్యల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రజలు మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలోని స్పందనకు వస్తున్నారని, అధికారులు వారి సమస్యలు మండల స్థాయిలోనే వీలైనంతగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు రామసుందర్‌ రెడ్డి, మనజీర్‌ జిలానీ సామూన్‌, నారపురెడ్డి మౌర్య, ఎంకేవీ శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ ఏపీడీ వెంకటసుబ్బయ్య, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌, నేషనల్‌ హైవే స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాఘవేంద్ర, హంద్రీనీవా సుజల స్రవంతి యూనిట్‌-4 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లికార్జున, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. 


పోలీసు స్పందనకు 143 ఫిర్యాదులు 


కర్నూలు, అక్టోబరు 25: జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 143 ఫిర్యాదులు వచ్చాయి. మహిళలకు రుణాలు ఇప్పిస్తామని, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని, భూవివాదాలు, కుటుంబ కలహాలు తదితర వాటిపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. వీటిని చట్ట ప్రకారం విచారించి త్వరిగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీలు వెంకటాద్రి, రామాంజినాయక్‌, దిశా వన్‌ స్టాఫ్‌ సిబ్బంది మేరీ, స్వర్ణలత పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:39:02+05:30 IST