బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌కు షోకాజ్‌ నోటీస్‌

ABN , First Publish Date - 2022-07-01T06:01:45+05:30 IST

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌కు షోకాజ్‌ నోటీస్‌

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌కు షోకాజ్‌ నోటీస్‌

మేడ్చల్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ శ్యామల సత్తిరెడ్డికి మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. రెం డు రోజుల క్రితమే ఈ నోటీస్‌ జారీ అయింది. టీఆర్‌ఎస్‌ మేయర్‌కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయడంతో నేతలు ఖంగుతిన్నారు. ఈ నోటీసుకు ఇన్‌చార్జి కమిషనర్‌కు, మేయర్‌ మధ్య జరిగిన వివాదమే కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గత నెలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటిలో చాలా మంది రోడ్లపై చెత్త పడవేస్తుండడంతో ప్రజల నుంచి నిరసన వచ్చింది. ఇన్‌చా ర్జి కమిషనర్‌ డీఆర్‌ర్డీవో పద్మజారాణి, కార్పొరేషన్‌ సిబ్బంది రోడ్లపై చెత్తవేస్తున్న వారిని పట్టుకునేందుకు అర్ధరాత్రి కాపు కాశారు. రోడ్లపై చెత్తవేస్తున్న ఆరుగురుని పట్టుకున్నా రు. వారికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ఆరుగురిలో ఒకరు అప్పటికప్పుడు రూ.10వేల జరిమానా చెల్లించారు. కానీ మిగిలిన ఐదుగురు కట్టలేదు. దీంతో వారి బైక్‌లను మున్సిపల్‌ సిబ్బంది తీస్కొచ్చి కార్యాలయంలో పెట్టారు. జరిమానా చెల్లించి వాహనాలను తీసుకెళ్లాలని, లేదంటే వాటిని పోలీసులకు అప్పగిస్తామని కమిషనర్‌ నోటీసు ఇచ్చారు. మరునాటి ఉదయం మేయర్‌ సత్తిరెడ్డి వచ్చి జరిమానా తీసుకోకుండానే వాహనాలను ఓనర్లుకు ఇచ్చేశారు. ఈ విషయంలో మేయర్‌, ఇన్‌చార్జి కమిషనర్‌కు మధ్య ఫోన్లో మాటల యుద్ధం జరిగింది. కమిషనర్‌ పద్మజారాణిపై కేటీఆర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని మేయర్‌ అన్నారు. ఈ విషయమై కమిషనర్‌.. కలెక్టర్‌కు మేయర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో మేయర్‌కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఈ నోటీస్‌ రద్దు కోసం మేయర్‌ కలెక్టర్‌ వద్దకు మంత్రి మల్లారెడ్డిని తీసుకువచ్చారు. నోటీ్‌సను రద్దు చేయా లని మంత్రి మల్లారెడ్డి చెప్పడంతో విషయం బయటకొచ్చింది. బోడుప్పల్‌లో అడుగడుగునా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై విచారణ జరిపాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ పద్మజారాణిని బాధ్యతలను నుంచి తప్పించేందుకు మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2022-07-01T06:01:45+05:30 IST