కోనసీమకు Ambedkar పేరు పెట్టడాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: Shravan Kumar

ABN , First Publish Date - 2022-06-01T19:49:20+05:30 IST

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని శ్రవణ్ కుమార్ విమర్శించారు.

కోనసీమకు Ambedkar పేరు పెట్టడాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: Shravan Kumar

Vijayawada: కోనసీమకు బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) పేరు పెట్టడాన్ని ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ (shravan kumar) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పేర్ల ద్వారా రాజకీయం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని, కొవ్వొత్తుల ప్రదర్శన చేద్దామని పోలీసులకు అనుమతి కోరితే.. తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఛలో విజయవాడకు పిలుపు ఇవ్వలేదని.. శాంతియుత ర్యాలీ (rally)కి పిలుపు ఇచ్చామన్నారు. అంబేడ్కర్ సమాజం కోసం రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఆయన కోసం చేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ర్యాలీ చేసే అధికారం తమకు లేదా? అని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-01T19:49:20+05:30 IST