Festive Dhamaka: 2-వీలర్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ 30 వరకే అవకాశం..

ABN , First Publish Date - 2022-10-06T22:17:34+05:30 IST

ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఫైనాన్స్ కంపెనీ ‘శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్’ (Shriram City) గుడ్‌న్యూస్ చెప్పింది.

Festive Dhamaka: 2-వీలర్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ 30 వరకే అవకాశం..

ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఫైనాన్స్ కంపెనీ ‘శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్’ (Shriram City) గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ ఫెస్టివ్ 3డీ దసరా దివాళీ ధమాక ’ ఆఫర్ పేరిట కనిష్ఠంగా 5.5 శాతం వడ్డీ రేటుకే ద్విచక్రవాహనాలపై లోన్స్ ప్రకటించింది. రుణం తీసుకున్న వ్యక్తులు సకాలంలో ఈఐఎంలు(EMI) చెల్లించగలిగితే ఒక ఈఎంఐ మొత్తాన్ని తిరిగి రిఫండ్ చేస్తామని బంపరాఫర్ ప్రకటించింది. ఈ మేరకు శ్రీరామ్ సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. 


ఈ ప్రత్యేక ఆఫర్‌‌లో కస్టమర్లకు వెంటనే లోన్ అప్రూవల్ లభిస్తుందని తెలిపింది. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజు లేదని, డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఉండబోవని వెల్లడించింది. అడ్వాన్స్ ఈఎంఐ సున్నాగా  ఉందని పేర్కొంది. ఈ ఫెస్టివ్ ఆఫర్లు అన్ని నవంబర్ 30 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.



2-వీలర్ ‘ ఫెస్టివ్ ధమాకా ’ ఫీచర్లు ఇవే..

1. కనిష్ఠ వడ్డీ రేటు స్కీమ్: ఈ స్కీమ్‌లో కనిష్ఠ వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది.

2. 10 ఎల్‌టీవీ స్కీమ్: ఈ స్కీమ్‌లో కస్టమర్లు డౌన్ పేమెంట్‌ను కనిష్ఠంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అన్నీ కంపెనీల ఉత్పత్తులు (ద్విచక్ర వాహనాలు)పై లోన్ లభిస్తుంది.

3. కేవలం 2 నిమిషాల్లో లోన్‌కు అప్రూవల్ లభిస్తుంది.

4. ట్రిపుల్ జీరో స్కీమ్: ఈ ప్రత్యేక ఆఫర్‌లో కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు సున్నాగా ఉంది. జీరో డాక్యుమెంటేషన్, అడ్వాన్స్ ఈఐఎం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

5. క్యాష్ బ్యాక్ ఆఫర్ : కస్టమర్లు షెడ్యూల్ ప్రకారం ఈఎంఐలు అన్నింటిని సకాలంలో చెల్లిస్తే.. ఒక ఈఎంఐ రిఫండ్ చేయబడుతుంది. 


దాదాపు రెండేళ్ల తర్వాత వేడుకల వాతావరణం మళ్లీ ఏర్పడిందని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీ ఎండీ, సీఈవో వైఎస్ చక్రవర్తి అన్నారు. పండగ సీజన్‌కు ముందు ఆగస్టు-సెప్టెంబర్‌ సమయంలో 2-వీలర్ డిమాండ్ ఆశాజనకంగా ఉందని, ఫెస్టివల్ సీజన్‌లో కూడా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు.

Updated Date - 2022-10-06T22:17:34+05:30 IST