దాదాపు మూడేళ్ల పాటు వెండితెరకు దూరమైన ప్రముఖ కథానాయిక శ్రుతి హాసన్ ప్రస్తుతం జోరుమీదుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా శ్రుతి షేర్ చేసిన హాట్ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మోకాలు లోతు నీటిలోకి దిగి శ్రుతి ఇచ్చిన హాట్ స్టిల్ వైరల్గా మారింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`, రవితేజ `క్రాక్` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తోంది.