ఓ బౌన్సర్‌ తగిలితే భయం పోతుంది!

ABN , First Publish Date - 2021-01-25T09:21:23+05:30 IST

ఒక బౌన్సర్‌ శరీరానికి తగిలితే వాటిపై భయం అదే పోతుందని టీమిండియా కొత్త ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నా డు. ఆస్ట్రేలియాతో ఆఖరిటెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, స్టార్క్‌ల బౌన్సర్ల పరంపరను సమర్థంగా...

ఓ బౌన్సర్‌  తగిలితే భయం పోతుంది!

న్యూఢిల్లీ: ఒక బౌన్సర్‌ శరీరానికి తగిలితే వాటిపై భయం అదే పోతుందని టీమిండియా కొత్త ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నా డు. ఆస్ట్రేలియాతో ఆఖరిటెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, స్టార్క్‌ల బౌన్సర్ల పరంపరను సమర్థంగా ఎదుర్కొన్న గిల్‌ 91 పరుగుల క్లాస్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయానికి పునాది వేశాడు. ‘ఒక బౌన్సర్‌ లేదా షార్ట్‌ పిచ్‌ బంతి శరీరానికి తగిలితే ఇక వాటికి భయపడాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు అవి తగులుతాయేమో, గాయపడతామేమోనన్న ఆందోళన ఉంటుంది. ఒకసారి అవి తగిలితే ఇక వెరుపు ఉండదు’ అని గిల్‌ పేర్కొన్నాడు. 


Updated Date - 2021-01-25T09:21:23+05:30 IST