మస్క్ ప్లీజ్.. స్విగ్గీనీ కొనుక్కోవూ.. వైరల్ అవుతున్న శుభమన్ గిల్ ట్వీట్!

ABN , First Publish Date - 2022-05-01T02:07:01+05:30 IST

ప్రపంచ కుబేరుడు, టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను దాదాపు 44 బిలియన్

మస్క్ ప్లీజ్.. స్విగ్గీనీ కొనుక్కోవూ.. వైరల్ అవుతున్న శుభమన్ గిల్ ట్వీట్!

ముంబై: ప్రపంచ కుబేరుడు, టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను దాదాపు 44 బిలియన్ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్న తర్వాత పలు సలహాలు, సూచనలతో ట్విట్టర్ మోతెక్కిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ క్రికెటర్ శుభమన్ గిల్ చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని కూడా మస్క్ కొనుగోలు చేయాలని గిల్ అందులో కోరాడు.  ‘‘ఎలాన్ మస్క్.. దయచేసి స్విగ్గీని కొనెయె, అలాగైతేనే వారు సకాలంలో ఫుడ్‌ను డెలివరీ చేస్తారు’’ అంటూ స్విగ్గీలో ఆర్డరిస్తే సకాలంలో డెలివరీ కాదన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. క్షణాల్లోనే వైరల్ అయిన ఈ ట్వీట్‌కు 57 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ట్విట్టర్ యూజర్లు కూడా స్విగ్గీపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ కామెంట్లు చేశారు. 


గిల్ ట్వీట్‌కు మస్క్ స్పందించకపోయినా స్విగ్గీ మాత్రం బదులిచ్చింది. ‘‘హాయ్ శుభమన్ గిల్. ట్విట్టర్ సంగతి పక్కనపెట్టండి. మీరు కనుక ఆర్డర్ చేసి ఉంటే ఆ వివరాలను పంపిస్తే అలా ఎందుకు జరిగిందో నిర్ధారించుకుంటాం’’ స్విగ్గీ అధికారిక కస్టమర్ కేర్ పేర్కొంది. కాగా, ఒక ఫేక్ స్విగ్గీ ఖాతా గిల్‌కు షాకిస్తూ ట్వీట్ చేసింది. ‘‘టీ20లో మీ బ్యాటింగ్ కంటే మేమే వేగంగా ఉంటాం’’ అని అందులో పేర్కొంది. ఇది కూడా వైరల్ అయింది.


Updated Date - 2022-05-01T02:07:01+05:30 IST