మూన్నాళ్ల ముచ్చటగా శుద్ధ జలకేంద్రం

ABN , First Publish Date - 2021-04-18T05:39:11+05:30 IST

పాత సింగరాయకొండ గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

మూన్నాళ్ల ముచ్చటగా శుద్ధ జలకేంద్రం
మూతపడిన శుద్దజలకేంద్రం

 మరమ్మతులను పట్టించుకోని అధికారులు

పాత సింగరాయకొండవాసుల అవస్థలు

సింగరాయకొండ, ఏప్రిల్‌ 17: పాత సింగరాయకొండ గ్రామస్థులు తాగునీటికి  ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పట్టించుకోవాల్సిన అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామస్థుల దాహం తీర్చడానికి గత టీడీపీ ప్రభుత్వ హయంలో స్థానిక జీవీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి ఆర్థిక సహాయంతో గత సర్పంచ్‌ శుద్దజలకేంద్రాన్ని నిర్శించారు. ఈ కేంద్రం సార్వత్రిక ఎన్నికల సమయంలో మరమ్మతులకు గురైంది. గత  నవంబర్‌ నెలలో పంచాయితీ నిధులు రూ. 3 లక్షలు వెచ్చించి వైసీపీ నాయకుడు  మరమ్మతులు చేయించారు. గతంలో ఉన్న రంగులు మార్చి కొత్త రంగు లు వేసి పైపై మెరుగులు దిద్దారు. గతంలో శుద్ధజల కేంద్రానికి అవసర మైన నీటికోసం పక్కనే బోరు వేశారు. దీని నుండి నీటిని ప్లాంట్‌కు తర లించి శుద్దిచేసి మంచి నీటిని సరఫరా చేసేవారు.

అయితే, మరమ్మ తుల క్రమంలో గతం లో శుద్ధజల కేంద్రాని కి నీటిని అందించే బోరును పట్టించుకోలే దు. నీటికోసం మరో కొత్త బోరును వేశా రు. అక్కడ నీరు పడ లేదు. దీంతో సమస్య మెదటికి వచ్చింది. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటిఇంటికీ నీటిని సరఫరా చేయడానికి వేసిన పైప్‌ నుంచి కనెక్షన్‌ను శుద్ధజలం కేంద్రానికి కలిపారు. మరమ్మతులు పూర్తిచేసి అధికార పార్టీ నాయకులు  ప్లాంటును ప్రారంభోత్సవం చేశారు. అయితే, ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. మరమ్మతు జరిపి రెండు నెలలు పూర్తి కూకుండానే మళ్లీ ప్లాం ట్‌ మూతపడింది. మూతపడి నాలుగు నెలలు అవుతున్నా పట్టించుకునే వారేలేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతు న్నారు. శుద్ధజల కేంద్రం ఆలనాపాలన పట్టించుకునేవారు లేకపోవడంతో  కేంద్రం పశువులకు నిలయంగా మారింది. కొందరూ దీనిలోని పశువులను కట్టి మేపుకుంటున్నారు. 

రెండు రోజుల్లో మరమ్మతులు చేసి నీటిని అందిస్తామని పంచాయతీ కార్యదర్శి పి.సాంబశివరావు తెలిపారు. ప్యానల్‌ బోర్డులో పాము దూరడంతో బోర్డు కాలిపోయిందని చెప్పారు. అవి ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో మరమ్మతులు ఆలస్యమైందన్నారు. 

Updated Date - 2021-04-18T05:39:11+05:30 IST