నకిలీ ఎస్‌ఐగా వ్యవహరించిన వలంటీరు అరెస్టు

ABN , First Publish Date - 2021-07-27T06:23:17+05:30 IST

మగటపల్లి గ్రామానికి చెందిన వలంటీరు బుంగా సురేష్‌ నకిలీ ఎస్‌ఐగా వ్వహరించి గ్రామానికి చెందిన చిల్లే రాము అనే యువ కుడిని ఫోన్‌లో బెదిరించి దుర్భాషలాడిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ ఎస్‌ఐగా వ్యవహరించిన వలంటీరు అరెస్టు

మామిడికుదురు, జూలై 26: మగటపల్లి గ్రామానికి చెందిన వలంటీరు బుంగా సురేష్‌ నకిలీ ఎస్‌ఐగా వ్వహరించి గ్రామానికి చెందిన చిల్లే రాము అనే యువ కుడిని ఫోన్‌లో బెదిరించి దుర్భాషలాడిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వలంటీరుతో పాటు అతడి స్నేహితుడు భూపతి రమేష్‌ కలిసి రాము అనే యువకుడిపై బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో రికార్డింగ్‌  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి విచారణ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ శశాంక కేసు నమోదు చేశారు.



Updated Date - 2021-07-27T06:23:17+05:30 IST