Kakinadaలో ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-13T14:12:28+05:30 IST

జిల్లాలోని సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య కలకలం రేపుతోంది.

Kakinadaలో ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య

కాకినాడ: జిల్లాలోని సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య కలకలం రేపుతోంది. పిస్టల్‌తో కాల్చుకుని ఎస్‌ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం, జిల్లా ఎస్పీ వేధింపుల వల్ల గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేశారు. ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్ళు ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ విధులు నిర్వహించాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్‌ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నాడు.  తాజాగా పోలీస్ బాస్ వేధింపులు అధికంకావడంతో ఈ అఘాయిత్యానికి ఎస్‌ఐ పాల్పడినట్లు తెలుస్తోంది. 

Read more