ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-10-18T04:33:57+05:30 IST

ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి
పీఎస్‌ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు, గ్రామస్థులు

  • కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట గ్రామస్థుల ధర్నా 


బొంరా్‌సపేట్‌: విచారణ కోసం పిలిపించి ఓ యువకుడిపై చేయిచేసుకున్న ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదివారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థులు పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. బొంరా్‌సపేట్‌ మండలం నాందర్‌పూర్‌గ్రామానికి చెందిన యాలాల రాఘవేందర్‌ అదే గ్రామానికి చెందిన కోట్లమల్లేశం దసరా పండగ రోజున గొడవపడ్డారు. ఈ ఘర్షణలో రాఘవేందర్‌తో పాటు మరో ఆరుగురిపై మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ నిమిత్తం రాఘవేందర్‌ను ఎస్సై వెంకటనారాయణ పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి చేయిచేసుకున్నాడు. దీంతో రాఘవేందర్‌ మూర్చలక్షణాలతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు, బంధవులు పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జయకృష్ణ, కోస్గి మార్కెట్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రాములుగౌడ్‌, రాజేశ్‌రెడ్డి, నర్సింహులుగౌడ్‌, మల్లికార్జున్‌ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, కొడంగల్‌ సీఐ అప్పయ్య బాధిత కుటుంబాన్ని సముదాయించారు. విచారణ జరిపిచర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డీఎస్పీ, సీఐ నాందర్‌పూర్‌నకు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు.

Updated Date - 2021-10-18T04:33:57+05:30 IST