SI suspended: బ్యాంకాక్‌ వెళ్లిన ఎస్సై సస్పెండ్

ABN , First Publish Date - 2022-07-20T23:26:36+05:30 IST

దర్శి ఎస్సై చంద్రశేఖర్‌ (SI Chandrasekhar)ను మలిక గార్గ్‌ సస్పెండ్ చేశారు. ఈ నెల 13న వైసీపీ (YCP) నేతలతో కలిసి చంద్రశేఖర్‌ బ్యాంకాక్‌

SI suspended: బ్యాంకాక్‌ వెళ్లిన ఎస్సై సస్పెండ్

ప్రకాశం: దర్శి ఎస్సై చంద్రశేఖర్‌ (SI Chandrasekhar)ను మలిక గార్గ్‌ సస్పెండ్ చేశారు. ఈ నెల 13న వైసీపీ (YCP) నేతలతో కలిసి చంద్రశేఖర్‌ బ్యాంకాక్‌ (Bangkok) వెళ్లారు. అనుమతి తీసుకోకుండా బ్యాంకాక్‌ వెళ్లడంపై ఎస్పీ సీరియస్‌ అయ్యారు. ఎస్సై, బ్యాంకాక్‌ వ్యవహారంపై విచారణ జరిపి ఎస్పీ సస్సెండ్ చేశారు. అధికారపార్టీ నేతలతో కలిసి చంద్రశేఖర్, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్యాంకాక్‌ వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అతనిపై వేటుపడింది. పోలీసు అధికారులు కట్టుతప్పి వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. చంద్రశేఖర్‌ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నిమార్లు విదేశాలకు వెళ్లారు.. ఉన్నతాధికారుల అనుమతులు పొందారా? అనే అంశా న్ని లోతుగా పరిశీలిస్తున్నారు.  పాస్‌పోర్టు ఆధారంగా అతని పర్యటన వివరాలను తెప్పించారు. ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో చంద్రశేఖర్‌ నడవడికను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా బ్యాంకాక్‌ నుంచి తన స్నేహితులతో ఉన్నతాధికారుల గురించి మాట్లాడిన వీడియోపైనా విచారణ చేస్తున్నారు. 


అయితే ఎస్సై మాత్రం తనకు ఉన్న విస్తృత పరిచయాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అదేక్రమంలో తన స్నేహితులతో కూడా తనపై ఎటువంటి యాక్షన్‌ ఉండదన్న ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంతమంది ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ఎస్సైపై వేటుపడకుండా చూడాలని సిఫార్సులు చేశారని ప్రచారం జరిగింది. ఇలాంటి దారితప్పిన విషయాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గితే పోలీస్‌ శాఖ జనంలో పలచన అవుతుందని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించడంతోపాటు, ఇంకా అనేకమార్లు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు ఉన్న అభియోగాలపైనా విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తూ కట్టు తప్పితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. మొత్తంగా ఎస్‌ఐ, బ్యాంకాక్‌ టూర్‌ ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-07-20T23:26:36+05:30 IST