గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-07-27T04:02:43+05:30 IST

మండల కేంద్రంలోని కల్వకుర్తి, జడ్చర్ల ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అంబులెన్స్‌ కోసం 108కు ఫోన్‌ చేయగా, కలవకపోవడంతో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయప్రసాద్‌ అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన ఎస్‌ఐ
గాయపడిన వ్యక్తిని పైకి ఎత్తుతున్న ఎస్‌ఐ జయప్రసాద్‌, యువకులు

మిడ్జిల్‌, జూలై 26: మండల కేంద్రంలోని కల్వకుర్తి, జడ్చర్ల ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అంబులెన్స్‌ కోసం 108కు ఫోన్‌ చేయగా, కలవకపోవడంతో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయప్రసాద్‌ అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. మిడ్జిల్‌కు చెందిన అశోక్‌ జడ్చర్లకు చెందిన తన బంధువు శర్వతో కలిసి పెట్రోల్‌ పోయించుకుని, మిడ్జిల్‌ వైపు వస్తుండగా కల్వకుర్తి నుంచి వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దాంతో అశోక్‌, శర్వ తలలకు గాయాలయ్యాయి. శర్వ శ్వాస తీసుకొలేని పరిస్థితిలో నిర్జివంగా పడి ఉన్నాడు. అటునుంచి వెళ్తున్న వానదారులు ఎవరూ వాహనాలు ఆపలేదు. స్థానికులు అంబులెన్స్‌ కోసం 108కు ఫోన్‌ చేయగా కలువ లేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయప్రసాద్‌ అక్కడికి చేరుకొని తన వాహనంలో గాయపడిన ఇరువురిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆక్సిజన్‌ పెట్టి, శర్వ చాతిపై వైద్యులు ఒత్తిడి చేయడంతో స్పృహ వచ్చింది. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎస్‌ఐ, ట్రైనీ ఎస్‌ఐ మన్మోహన్‌గౌడ్‌, కానిస్టెబుల్‌ పర్వతాచారిలను పలువురు అభినందించారు. 

Updated Date - 2021-07-27T04:02:43+05:30 IST