‘లైగర్’ భామతో ఫోటో షూట్.. ఆ యంగ్ హీరో చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Published: Tue, 25 Jan 2022 12:31:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లైగర్ భామతో ఫోటో షూట్.. ఆ యంగ్ హీరో చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘గెహ్రయాన్’. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘లైగర్’ భామ అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర బృందం బిజీగా ఉంది.


తాజాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమం ముంబైలోని ఓ హోటల్‌లో జరిగింది. అది ముగిసిన అనంతరం అనన్య, సిద్ధాంత్ మీడియా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియోని ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అందులో.. అనన్య బ్లేజర్ తీసేసి కేవలం టాప్‌తో ఫోజులు ఇచ్చింది. ఈ తరుణంలో చలిగాలి వేగంగా వీచడంతో ఈ భామ తట్టుకోలేకపోయింది. ఇది గమనించిన సిద్ధాంత్ వెంటనే ఆమె బ్లేజర్‌ని తీసుకొచ్చి ఈ బ్యూటీకి స్వయంగా తొడిగాడు.


ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు సిద్ధాంత్ చేసిన పనికి ఫిదా అవుతూ అతడిని పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ‘జెంటిల్ మేన్’, ‘సూపర్’, ‘చాలా కేరింగ్’, ‘ఎంతో మంచి వ్యక్తి కదా’ అంటూ ఆ యంగ్ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు వాతావరణానికి తగిన దుస్తులు ధరించొచ్చు కదా అంటూ అనన్యపై కూడా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...