సమంతకు సిద్ధార్థ ఘాటు రిప్లై

Published: Wed, 08 Dec 2021 15:11:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సమంతకు సిద్ధార్థ ఘాటు రిప్లై

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ పై సమంత ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. అందులో సామ్..  ‘ఎన్నో ఏళ్లు కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. 2021లో వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఇబ్బందుల కారణంగా నా కలలన్నీ శిథిలమైపోయాయి. నేనెంతో కుంగుబాటుకు లోనయ్యాను. ఇక, సోషల్‌మీడియా గురించి చెప్పాలంటే.. నటీనటుల్ని తమ అభిమానులకు చేరువ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వాళ్లు నా జీవితంలో భాగమైపోయారు. కానీ.. మరికొంత మంది మాత్రం.. ట్రోల్‌ చేస్తున్నారు.. అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. వారందర్నీ నేను కోరేది ఒక్కటే.. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్‌ చేయను. కానీ, మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.


అయితే ఆమె పోస్ట్ కు  తమిళ హీరో సిద్దార్థ ఘాటైన రిప్లై ఇచ్చారు. ‘నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి’.. అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో సమంతాని ఉద్దేశించే సిద్దార్థ .. ఆ వ్యాఖ్యలు చేశారని, సామ్ పెంచిపోషించిన అభిమానులే ఆమెని ట్రోల్ చేశారన్న అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారని చర్చించుకుంటున్నారు. మరి దీనిపై సిద్ధార్థ  ఎలా స్పందిస్తారో చూడాలి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International