ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తున్నా: కేసీఆర్

ABN , First Publish Date - 2021-06-20T23:46:11+05:30 IST

ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తున్నా: కేసీఆర్

ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తున్నా: కేసీఆర్

సిద్దిపేట: సిద్దిపేట నేను పుట్టిన జిల్లా అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించానన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పండేది మేలైన పత్తి అని స్పష్టం చేశారు. తెలంగాణలో 400 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తున్నామని చెప్పారు. అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు వేస్తున్నామన్నారు. అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని చెప్పారు. రైతులకు మంచి జరుగుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్దారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు పేదల కోసం ఖర్చవుతున్నాయని సీఎం కేసీఆర్‌  తెలిపారు. 

Updated Date - 2021-06-20T23:46:11+05:30 IST