జిల్లా అధికారుల క్వార్టర్స్‌ను సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-06-29T05:47:42+05:30 IST

జిల్లా అధికారుల క్వార్టర్స్‌ను అధికారులు నివాసం ఉండేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ ఆవరణ వెనుక వైపు నిర్మించిన జిల్లా అధికారుల నివాస గృహాలను మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. క్వార్టర్స్‌లోని ప్రతి గదిని పరిశీలించారు. జిల్లా అధికారులు కుటుంబాలతో సౌకర్యవంతంగా నివసించేందుకు అనువుగా ఉన్నాయని చెప్పారు.

జిల్లా అధికారుల క్వార్టర్స్‌ను సిద్ధం చేయాలి
క్వార్టర్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌

అధికారులకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశం

ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ నిర్మాణ పనుల తనిఖీ


సిద్దిపేట అగ్రికల్చర్‌, జూన్‌ 28: జిల్లా అధికారుల క్వార్టర్స్‌ను అధికారులు నివాసం ఉండేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ ఆవరణ వెనుక వైపు నిర్మించిన జిల్లా అధికారుల నివాస గృహాలను మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. క్వార్టర్స్‌లోని ప్రతి గదిని పరిశీలించారు. జిల్లా అధికారులు కుటుంబాలతో సౌకర్యవంతంగా నివసించేందుకు అనువుగా ఉన్నాయని చెప్పారు. అవసరమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసి అధికారులకు అందజేసేందుకు సిద్ధం చేయాలని, కలెక్టరేట్‌కు కేటాయించిన భూమి చుట్టూ మిగిలి ఉన్న కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్‌రెడ్డిలను ఆదేశించారు. జిల్లా అధికారుల క్వార్టర్స్‌ పరిసరాలలో పండ్ల మొక్కలు నాటాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, కొండపాక ఎంపీడీవో రాంరెడ్డిలను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట కలెక్టరేట్‌ ఏవో రెహమాన్‌, డీఆర్డీవో గోపాల్‌రావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి సరోజ, జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-06-29T05:47:42+05:30 IST